Share News

నిర్ణీత గడువులోగా వినతుల పరిష్కారం

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:24 AM

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

నిర్ణీత గడువులోగా వినతుల పరిష్కారం
వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 70 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ 36, సాధారణ వినతులు 34 ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్‌ దిలీప్‌ చక్రవర్తి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు ఎం.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 12:24 AM