Share News

మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:43 PM

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం, లోక్‌ అదాలత్‌ల ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవా లని రాజాం మండల న్యాయ సేవా సంస్థ అధ్యక్షు రాలు, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.శారదాంబ సూచించారు.

మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
సంతకవిటి: మాట్లాడుతున్న న్యాయాధికారి శారదాంబ

- సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శారదాంబ

సంతకవిటి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం, లోక్‌ అదాలత్‌ల ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవా లని రాజాం మండల న్యాయ సేవా సంస్థ అధ్యక్షు రాలు, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.శారదాంబ సూచించారు. మంగళవారం గుళ్లసీతారాంపురంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యవర్తిత్వం, ఉచిత న్యాయ సహాయం, లోక్‌ అదాలత్‌ ప్రయోజనాలను ఆమె వివరించారు. వివాహ, గృహహింస, చెక్‌ బౌన్స్‌, సివిల్‌ కేసులతో పాటు రాజీకి అనుకూలమైన క్రిమినల్‌ కేసులను మ ధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొ న్నారు. న్యాయ సహాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 15100ను సంప్రదించవ్చని సూచిం చారు. కార్యక్రమంలో రాజాం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.సత్యనారాయణ, కార్యదర్శి కె.కృష్ణారావు, సీనియర్‌ న్యాయవాది ఎ.రంగారావు, న్యాయవాదులు, మాజీ సర్పంచ్‌ రావు రవీంద్ర, పోలీసు సిబ్బంది, ఆలయ ప్రతినిధులు, గ్రామ స్థులు పాల్గొన్నారు.

తాటిపాడు గ్రామంలో..

రేగిడి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని తాటిపాడు గ్రామంలో సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.శార దాంబ అధ్యక్షతన న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. రాజీకి అనుకూలమైన కేసులను స్నేహ పూర్వక వాతావరణంలో పరిష్కరిం చుకోవచ్చని తెలి పారు. న్యాయవాదులు, ఎస్‌ఐ వి.బాలకృష్ణ, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:43 PM