లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:20 AM
జిల్లాలో శనివారం పలు న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
జిల్లాలో శనివారం పలు న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ అదాలత్‌లలో పలు కేసులను పరిష్కరించారు.
గజపతినగరంలో 1117..
గజపతినగరం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): స్థానిక జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మున్సిఫ్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్‌లో 1117 కేసులు పరిష్కరించామని న్యాయా ధికారి ఎ.విజయ్‌రాజ్‌కుమార్ తెలిపారు. న్యాయాధికా రులు చప్పా తిరుపతిరావు, రమేష్‌రాజు, రెడ్డి శ్రీనివాసు లనాయుడు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురంలో 892 ..
బెలగాం, 14 మార్చి (ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్ అదాలత్‌లో 892 కేసులు రాజీ అయ్యాయని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం పార్వతీపురంలోని కోర్టు ఆవరణ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్‌లో మోటార్ యాక్సి డెంట్ కేసులు-8, సివిల్ దావాలు కేసులు-29 పరిష్కారం అయ్యాయని న్యాయా ధికారి తెలిపారు. అడిషనల్ జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ న్యాయాధికారి జె.సౌమ్యా జోస్పిన్, లోక్ అదాలత్ సభ్యులు, బార్ ప్రెసెడెంట్, న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ కురుపాం: కురుపాం కోర్టుకు సంబందించిన 81 కేసులు పార్వతీపురం కోర్టులో నిర్వహించి న లోక్ అదాలత్‌లో న్యాయాధికారి జె.సౌమ్య జోస్పిన్ పరిష్కరించారు. ఇందులో 74 ఎస్‌టీపీ కేసులు, 7 క్రిమినల్ కేసులు పరిష్కరించారు. వీరికి రూ.28,200 జరిమానా విధించారు. ఏపీపీ కిమిడి చంద్రకుమార్, న్యాయవాదులు ఎస్.కృష్ణ, శరత్ చైతన్య పాల్గొన్నారు.
సాలూరులో 130..
సాలూరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక జూని యర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 130 కేసులు పరిష్కారమ య్యాయి. జూనియర్ సివిల్ న్యాయాధికారి, అదాలత్ చైర్మన్ జె.హర్షవర్ధన్, ఎన్. ఎస్.చలం, గంట అప్పలనా యుడుల ఆధ్వర్యంలో లోక్ అదాలత్ బెంచ్ ఏర్పా టైంది. ఈసందర్భంగా 12 సివిల్, 92 క్రిమినల్, 21 సారా కేసులు, 5 చెక్ బౌన్స్ కేసులు వెరసి 130 కేసు లను పరిష్కరించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షు డు జగన్నాథరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.
రాజాంలో1085 ..
రాజాం రూరల్, మార్చి 14 (ఆంరఽధజ్యోతి): రాజాంలోని కోర్టు సముదాయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 1085 కేసులను పరిష్కరించామని మండల న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు, సీనియర్ న్యాయాధికారి కె.శారదాంబ తెలిపారు. జూనియర్ న్యాయాధికారి నైమిషతో కలిసి ఏర్పాటుచేసిన రెండు బెంచ్‌ల ద్వారా కేసులు పరిష్క రించామని చెప్పారు. ఈ అదాలత్‌లో పలువురు న్యా యవాదులు, పొలీస్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
కొత్తవలస, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): సివిల్ కేసులు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుంటే కోర్టు ఫీజును వెనక్కుతీసుకునే అవకాశం ఉందని కొత్తవలస న్యాయాధికారి డా.సముద్రాల విజయ్‌చందర్ తెలిపా రు. శనివారం కొత్తవలస కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. న్యాయవాదులు గిరిబాబు, మహేంద్ర, డి.శ్రీనివాస్, శ్రీరామమూర్తి పాల్గొన్నారు.