Share News

‘కుల గణన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్‌ కల్పించాలి’

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:01 AM

రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగణన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్‌ కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, రొంగలి రామారావులు డిమాండ్‌ చేశారు.

‘కుల గణన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్‌ కల్పించాలి’

విజయనగరం దాసన్నపేట, జూలై 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగణన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్‌ కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, రొంగలి రామారావులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక బీసీ భవనంలో ఏర్పా టుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో 2,034 కులాలు, 25వేల ఉప కులాలు ఉంటే 70 నుంచి 80 కులాలు మాత్రమే రాజకీయ అధికారంలో ఉన్నా యన్నారు. రాష్ట్రంలో 134 కులాలు, 2 వేల ఉప కులాలు ఉంటే.. 10 నుంచి 20 కులాలకు మాత్రమే రాజకీయ ప్రాతినిధ్యం ఉందని తెలిపారు. ఎక్కువ మంది వార్డు మెంబరు పదవులకు కూడా నోచుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబ రు, అక్టోబరు నెలలో ఎన్నికలు జరపడానికి ప్రయత్నిస్తున్నదని, డాక్టరు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ ఏ కులం వారు ఎంత శాతం మంది ఉన్నారు.. ఏ కులా నికి ఎంత శాతం రాజకీయాల్లో వాటా కేటాయించాలన్న నివేదిక ఇప్పటి వరకూ ప్రకటన చేయలేదని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాల ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు ఐశ్వర్య యాదవ్‌, సత్యనారాయణ, టీవీ దుర్గారావు, పైడిరాజు, రామారావు, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 12:01 AM