Share News

బీసీలకు రిజర్వేషన్‌ కూటమితోనే సాధ్యం

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:20 AM

టీడీపీలో ఎన్టీఆర్‌ హయాం నుంచి బీసీలకు ప్రాధాన్యం ఇస్తునే వస్తున్నారని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.

బీసీలకు రిజర్వేషన్‌ కూటమితోనే సాధ్యం

  • చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు

చీపురుపల్లి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): టీడీపీలో ఎన్టీఆర్‌ హయాం నుంచి బీసీలకు ప్రాధాన్యం ఇస్తునే వస్తున్నారని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. చీపురుపల్లిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బీసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించడం కేవలం టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి సాధ్యమన్నారు. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడం జగన్‌కు నచ్చదని, అందుకే ఆయన ఆ వర్గాలపై తీవ్రమైన కక్ష పెంచుకున్నారని, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, తాడ్డి సన్యాసినాయుడు, కోట్ల మోతీలాల్‌నాయుడు, పైల బలరాం, దాసరి శివప్రసాద్‌, వెన్నె సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:20 AM