పింఛన్లు కావాలంటూ వినతులు
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:11 AM
తమకు పింఛన్లు మంజూరు చేయాలని ఎస్.కో ట నియోజకవర్గానికి చెందిన అనేకమంది ఎమ్మెల్యే లలిత కుమారిని కోరారు.
లక్కవరపుకోట, జూలై 9(ఆం ధ్రజ్యోతి): తమకు పింఛన్లు మంజూరు చేయాలని ఎస్.కో ట నియోజకవర్గానికి చెందిన అనేకమంది ఎమ్మెల్యే లలిత కుమారిని కోరారు. ఈ మేరకు గురువారం ఎల్.కోటలోని ఎమ్మె ల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్‌కు వారంతా హాజ రయ్యారు. ఈసందర్భంగా వినతులు అందజేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్త యినా కొత్త పింఛన్లు విడుదల చేయలేదన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ త్వరలోనే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని అర్హులందరికీ పింఛన్లు అందిస్తుందని తెలిపా రు. దరఖాస్తులన్నీ ఆన్‌లైన్ చేసి, సిద్ధంగా ఉంచుతున్నామని ఆమె చెప్పారు.