కోళ్లఫారం తొలగించాలని వినతి
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:10 AM
మండలంలో ని భవానీనగర్‌కు చెందిన ఒక మహిళ తమ నివాసాల వద్ద కోళ్లఫారం పెట్టి.. తమను జబ్బులపాలు చేస్తోందని రామన్నపాలెం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్.కోట రూరల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): మండలంలో ని భవానీనగర్‌కు చెందిన ఒక మహిళ తమ నివాసాల వద్ద కోళ్లఫారం పెట్టి.. తమను జబ్బులపాలు చేస్తోందని రామన్నపాలెం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోళ్లఫారాన్ని వెంటనే ఇక్కడ నుంచి తొలగించాలని కోరుతూ వారు ఎమ్మెల్సీ రఘురాజుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. గతంలో ఇక్కడ కోళ్లఫారం పెడతామంటే తాము వ్యతిరేకించడంతో ఆపేశారని.. అయితే నెలరోజుల కిందట తమపై దౌర్జన్యం చేసి మళ్లీ పెట్టారని తెలిపారు. చని పోయిన కోళ్లను తమ ఇళ్ల వద్ద పాతేస్తున్నారని, దీనివల్ల వృద్ధులు, చిన్నారులు జబ్బుల పాలవుతున్నారని వాపోయారు.
ఈ విషయంపై కిల్తంపాలెం పంచా యతీ కార్యదర్శి శంకర్ వివరణ కోరగా.. అక్కడ గతంలో షెడ్లు కట్టారని, అయితే పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఈ కోళ్లఫా రం జనావాసాలకు 500 మీటర్ల లోపు ఉందని, వైద్య ఆరోగ్యశాఖ అనుమతి కూ డా లేదని చెప్పారు. షెడ్లు తొలగించాలని వారికి నోటీసులు ఇస్తే.. తమపై కోర్టు లో కేసు వేశారన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టామన్నారు.