ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై మంత్రికి వినతి
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:13 AM
ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగం గా విజయనగరం జోన్ నాయకులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజులను గురువారం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.
విజయనగరం రింగురోడ్డు, జూలై 16(ఆం రఽధజ్యోతి): ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగం గా విజయనగరం జోన్ నాయకులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజులను గురువారం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. జేఏసీ నాయకులు రాఫిల్, భానుమూర్తిలు మాట్లాడు తూ ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవా లని, సంస్థ ఆధ్వర్యంలో వాటి ని నడపాలని కోరారు. సంస్థలో కొత్త బస్సుల కొనుగో ళ్లుతో పాటు ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావల్సిన డీఏ లీవ్ బకాయిలతో పాటు మధ్యంతర భృతిని వెంట నే చెల్లించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్క రించాలని కోరారు. ప్రతినిధులు కేవీఆర్ నర్సింగరావు, వి.రాములు, బి.సూర్యరాములు, ప్రదీప్ కుమార్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.