Share News

విలేకరిపై కర్రతో దాడి

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:23 AM

ఓ విలేకరిపై కర్రతో దాడి చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.

విలేకరిపై కర్రతో దాడి

పూసపాటిరేగ, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ఓ విలేకరిపై కర్రతో దాడి చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చోడమ్మఅగ్రహారం జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని స్థానికంగా కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా.. అప్పట్లో వెలువడిన కథనాలకు స్పందించి స్థానిక రెవెన్యూ అధికారులు ఆ పనులు నిలుపుదల చేశారు. తిరిగి అక్రమార్కులు బుధవారం మట్టిని నింపి దర్జాగా ఆక్రమణకు పాల్పడ్డారు. అయితే సదరు విలేకరి పందిరిపల్లి గోవిందు బుధవారం తన స్వగ్రామమైన గోవిందపురం నుంచి వస్తుండగా.. అతడిపై ఓ వ్యక్తి కర్రతో దారుణంగా దాడిచేశారు. తోటి పాత్రికేయులు అతన్ని సుందరపేట ఆసుపత్రికి తరలించారు. దాడి చేసినవారిపైన, దాడికి ప్రోత్సహించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పాత్రికేయులు పూసపాటిరేగ ఎస్‌ఐ కిరణ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - Aug 20 , 2026 | 12:23 AM