Replace అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిని మార్చండి
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:48 PM
Replace Araku Parliamentary President టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతిని మార్చాలని జిల్లాకు చెందిన పార్టీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు.
పార్వతీపురం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతిని మార్చాలని జిల్లాకు చెందిన పార్టీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఆమె ఒక పవర్‌పాయింట్‌గా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా తమకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. అంకితభావంతో పనిచేసే మరొకరికి ఆ పదవి ఇవ్వాలని కోరినట్టు పార్టీకి చెందిన ముఖ్యప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేని అధ్యక్షుడిగా నియమించాలని నాయకులు కోరినట్టు తెలియవచ్చింది. పల్లాను కలిసిన వారిలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, పాలకొండ ఇన్‌చార్జి పడాల భూదేవి, నాలుగు నియోజకవర్గాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.