Re-NEET conducted peacefully.ప్రశాంతంగా రీ నీట్
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:22 AM
Re-NEET conducted peacefully. రీ-నీట్ యూజీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆరు కేంద్రాల్లో 1745 మంది విద్యార్థులు హాజరయ్యారు. గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్లు లీక్ కావడంతో మరోసారి ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ప్రశాంతంగా రీ నీట్
1745 మంది విద్యార్దులు హాజరు
కేంద్రాలను పరిశీలించిన అధికారులు
విజయనగరం/ కలెక్టరేట్, జూన్21(ఆంధ్రజ్యోతి): రీ-నీట్ యూజీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆరు కేంద్రాల్లో 1745 మంది విద్యార్థులు హాజరయ్యారు. గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్లు లీక్ కావడంతో మరోసారి ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టారు. అభ్యర్థులు ఆయా కేంద్రాలకు ఉదయం 11 గంటల నుంచి చేరుకున్నారు. నిర్వాహకులు తనిఖీ చేసిన తరువాత పరీక్ష హాల్‌లోకి అనుమతించారు. జెఎన్‌టీయూ అకడిమిక్ బ్లాక్ 2, బ్లాక్ 1, పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం, కస్పా మున్సిపల్ హైస్కూల్, ఎంఆర్‌జీఆర్ పాలిటెక్నికల్, ఏపీ మోడల్ స్కూల్ ఆయ్యప్పనగర్‌లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 1901 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1745 మంది హాజరయ్యారు. 156 మంది పరీక్షకు దూరంగా ఉన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. నీట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ దామోదర్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. బందోబస్తు విధుల్లో వున్న పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.