కూటమి పాలనలో అద్భుత విజయాలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:13 AM
కూటమి పాలనలో ఎన్నో అద్భుత విజయాలను సాధించగలిగామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.
బొబ్బిలి, డిసెంబరు31 (ఆంధ్రజ్యోతి): కూటమి పాలనలో ఎన్నో అద్భుత విజయాలను సాధించగలిగామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్‌లో బుఽధవారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ర్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. సఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ర్టానికి ఎంతో నష్టం జరిగిందన్నారు. ఆ ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. పారాది నూతన వంతెనను మే ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే రోడ్లన్నీ బాగుచేశామని, మరో రూ.15 నుంచి 20 కోట్లు రోడ్ల కోసం మంజూర య్యాయన్నారు. లోచర్ల, శివడవలస ఎత్తిపోతల పథకాలకు సీఎం త్వరలో నిధులు విడుదల చేస్తారన్నారు. సువర్ణముఖి నుంచి బొబ్బిలికి తాగునీటి సరఫరా పథకానికి టెండరు ప్రక్రియ పూర్తయిందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు వెలగాడ హైమావతి, బొత్స రమేశ్, కాకల వెంకటరావు, కళ్యంపూడి సత్య నారాయణ, దిబ్బగోపి, వాసు తదితరులు పాల్గొన్నారు.