విధుల్లో అప్రమత్తంగా ఉండండి: ఏఆర్ డీఎస్పీ
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:05 AM
ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి, సీఐ సుధాకర్ బాబు సూచించారు. బుధవారం కురుపాం మండల పరిషత్ కార్యాలయంలో పోలీసు సిబ్బందితో సమావేశమై, ఎన్నికల విధుల్లో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు.
కురుపాం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి, సీఐ సుధాకర్ బాబు సూచించారు. బుధవారం కురుపాం మండల పరిషత్ కార్యాలయంలో పోలీసు సిబ్బందితో సమావేశమై, ఎన్నికల విధుల్లో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు పి.నారాయణరావు, పి.రమేశ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.