Share News

Relocation of the Sirimanu tree today. నేడు సిరిమాను చెట్టు తరలింపు

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:19 AM

Relocation of the Sirimanu tree today. పైడిమాంబ సిరిమాను చెట్టు తరలింపునకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం తొలుత పూజలు చేశాక చెట్టు కొట్టే ప్రక్రియ చేపడ్తారు. ఇందుకు 8 గంటలకు ముహూర్తం పెట్టారు.

Relocation of the Sirimanu tree today. నేడు సిరిమాను చెట్టు తరలింపు
సిరిమాను, ఇరుసుమానుగా మారనున్న చెట్లు ఇవే

నేడు సిరిమాను చెట్టు తరలింపు

జొన్నవలస నుంచి హుకుంపేటకు పయనం

ఏర్పాట్లు చేసిన పోలీసు, రెవెన్యూ, దేవదాయశాఖాధికారులు

విజయనగరం కల్చరల్‌/ రూరల్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి):

పైడిమాంబ సిరిమాను చెట్టు తరలింపునకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం తొలుత పూజలు చేశాక చెట్టు కొట్టే ప్రక్రియ చేపడ్తారు. ఇందుకు 8 గంటలకు ముహూర్తం పెట్టారు. సిరిమాను, ఇరుసుమాను చెట్లను వేరు చేశాక నాటుబళ్లపై విజయనగరం బయలుదేరుతారు. ఊరేగింపునకు ముందు జొన్నవలసలో భారీ అన్నదానం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత సిరిమాను, ఇరుసుమాను తరలింపు తంతు మొదలుకానుంది. దుప్పాడ, ఉడాకాలనీ, ఎత్తుబ్రిడ్జి, రైల్వేస్టేషన్‌ మీదుగా ఎన్‌సీఎస్‌, కన్యకాపరమేశ్వరీ ఆలయం, ఆపై హుకుంపేటకు తరలించనున్నారు. భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో సిరిమాను చెట్టు కొట్టే ప్రాంతంలో ఉదయం నుంచి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపై తహసీల్దారు హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ, సిరిమాను, ఇరుసుమాను తరలింపు కార్యక్రమానికి సంబంధించి రెవెన్యూశాఖ పరంగా ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2.30 గంటలకు బయలు దేరేలా చూస్తామన్నారు. విజయనగరం అర్బన్‌ తహసీల్దారు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సిరిమాను, ఇరుసుమాను చెట్లు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వన్‌టౌన్‌, టూటూన్‌ సీఐలు ఆర్‌వీఆర్‌కె చౌదరి, టెంకల శ్రీనివాసరావు మాట్లాడుతున్న సిరిమాను చెట్టు తరలింపునకు అందరూ సహకరించాలని కోరారు. జొన్నవలసలో రెండు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. సిరిమాను చెట్టు వెళ్లే క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలను నిలిపివేస్తామని, ఆ తరువాత వాటిని తిరిగి అనుమతిస్తామన్నారు.

రూట్‌ మ్యాప్‌ ఇదే

సిరిమాను చెట్టు జొన్నవలస, దుప్పాడ నుంచి విజయనగరం రైతు బజారు, ఎత్తుబ్రిడ్జి, రైల్వే స్టేషన్‌ రోడ్డు, అక్కడి నుంచి ఎన్‌సీఎస్‌ థియేటర్‌ రోడ్డు, డాబాగార్డెన్స్‌, కన్యకాపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా మూడు లాంతర్లకు చేరుకుంటుందని రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి శివాలయం వీధి, పార్కుగేటు, తెలకలవీధి రామమందిరం, మండపం మీదుగా హుకుంపేటకు చేరుతుంది. దాదాపు 8 కిలోమీటర్లు దూరం వుంటుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు జొన్నవలసలో బయలుదేరితే హుకుంపేట చేరుకునేసరికి రాత్రి 11 గంటల నుంచి 12 గంటలు కావొచ్చునంటున్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:19 AM