Share News

మత సామరస్యాన్ని పాటించాలి

ABN , Publish Date - May 12 , 2026 | 12:20 AM

హనుమాన్‌ జయంతి, దళిత క్రైస్తవ మహాసభలు సందర్భంగా జిల్లా ప్రజలందరూ పరస్పర గౌరవంతో వ్యవహరించా లని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ సూచించారు.

 మత సామరస్యాన్ని పాటించాలి

విజయనగరం క్రైం, మే 16(ఆంధ్రజ్యోతి): హనుమాన్‌ జయంతి, దళిత క్రైస్తవ మహాసభలు సందర్భంగా జిల్లా ప్రజలందరూ పరస్పర గౌరవంతో వ్యవహరించా లని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ సూచించారు. ఈమేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమాజంలో శాంతి, మత సామరస్యాన్ని కాపాడు కోవడం ప్రతి పౌరుడి బాధ్యతని అన్నారు. మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహించే విధంగా, అశాంతిని రేకెత్తించే విధంగా పోస్టులు పెట్టడం చట్ట ప్రకారం నేరమని తెలిపారు. గ్రూప్‌ అడ్మిన్లు తమ గ్రూపుల్లో షేర్‌చేసే ప్రతి మెసేజ్‌ను నిశితంగా పరిశీలించి.. ఏవైనా ద్వేషపూరిత, అభ్యంతరకమైన, రెచ్చగొట్టే విధంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఆ సందేశాలను తొలగించి, సంబంధిత వ్యక్తులను గ్రూప్‌ నుంచి తొలగించాలని సూచించారు. ఇటీవల కడప జిల్లాలో జరిగిన ఘటన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వినియోగంపై జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. జిల్లాలో 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉందని, ధర్నాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతు లు తప్పకుండా తీసుకోవాలన్నారు. నేరచరిత్ర ఉన్నవారిపై నిఘా పెట్టామని, అల్లర్లు, గొడవలు జరిగితే కమిటీ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - May 12 , 2026 | 12:20 AM