Share News

రహదారులకు మోక్షం

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:19 AM

జిల్లాలో నిలిచిపోయిన బీటీ రహదా రులకు మోక్షం కలగనుంది. వారం రోజుల్లో పను లను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రహదారులకు మోక్షం
పార్వతీపురం మండలం బుదురువాడ రోడ్డు పనులు నిలిచిపోయిన దృశ్యం

- వారం రోజుల్లో పనులు పునఃప్రారంభం

- మంత్రి ఆదేశాలతో అధికారుల చర్యలు

-అవసరమైన ప్రక్రియ పూర్తి

పార్వతీపురం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యో తి): జిల్లాలో నిలిచిపోయిన బీటీ రహదా రులకు మోక్షం కలగనుంది. వారం రోజుల్లో పను లను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంత్రి గుమ్మిడి సంఽ ద్యారాణి ఆదేశాలతో రహదారుల పనులకు సంబంధించిన ప్రక్రియను గురువారం పూర్తి చేశారు.

147 రోడ్లు..

గత ఏడాది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో సుమారు 147 బీటీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో 90శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరిం చేది. కానీ, ఉపాధి హామీ పథకం స్థానంలో ‘వీబీ జీ రామ్‌ జీ’ ప్రవేశపెట్టడంతో నిధుల కేటాయింపు కూడా పూర్తిగా మారిపోయింది. ఈ పథకం కింద 60 శాతం నిధులు మాత్ర మే మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద కేంద్రం మంజూరు చేస్తుంది. దీంతో ఈ రోడ్డు పను లకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇదే సమయం లో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తారు రేటు రెట్టింపు కావడంతో బీటీ రహదా రుల పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 16న కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష జరిగింది. ఆగిపోయిన రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ సమీక్షలో అధికారులను ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా అధికారుల్లో కదలిక వచ్చింది. పనులకు సంబంధించిన ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. మరో వారం రోజుల్లో పనులు పునః ప్రారంభిం చేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా, తారు రేట్లు పెరగడంతో అదనపు భారం పడ నుంది. గతంలో ఈ పనులు పూర్తి చేసేం దుకు రూ.62 కోట్లు కేటాయించారు. ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతో మరో రూ.13 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ విషయంపై జిల్లా పంచాయతీ ఇంజనీరింగ్‌ అధికారి ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘పెండింగ్‌ బీటీ రహదారుల పనులను పూర్తి చేస్తాం. తారు రేట్లు పెరగడంతో పనులు మధ్యలో నిలిచిపోయాయి. త్వరలోనే పను లు ప్రారంభిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Sep 18 , 2026 | 12:19 AM