Share News

Relentless Flood వీడని వరద

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:52 PM

Relentless Flood దుగ్గేరు సమీపంలోని అడారు గెడ్డలో వరద నీటి ప్రవాహం తగ్గడం లేదు. దీంతో కాజ్‌వేపై నుంచి ఎనిమిది గిరిజన గ్రామాల ప్రజలకు రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగాయి. ఈ నేపథ్యంలోనే అడారుగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది.

Relentless Flood  వీడని వరద
అడారుగెడ్డలో ఒరిగిపోయిన ఎక్స్‌కవేటర్‌

  • ఎనిమిది గిరిజన గ్రామాల ప్రజలకు తప్పని అవస్థలు

మక్కువ , అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): దుగ్గేరు సమీపంలోని అడారు గెడ్డలో వరద నీటి ప్రవాహం తగ్గడం లేదు. దీంతో కాజ్‌వేపై నుంచి ఎనిమిది గిరిజన గ్రామాల ప్రజలకు రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగాయి. ఈ నేపథ్యంలోనే అడారుగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గెడ్డ ఆనుకుని ఉన్న కాజ్‌వే పైనుంచి వరదనీరు ప్రవహించడంతో ప్రజలు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా.. గెడ్డలో వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు. అధికంగా నీటి ప్రవాహం ఉండడంతో ప్రజలు కాజ్‌వే దాటేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. శుక్రవారం ఎక్స్‌కవేటర్‌ సాయంతో ఆ మార్గాన్ని క్లియర్‌ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వరద తీవ్రతకు ఎక్స్‌కవేటర్‌ గెడ్డలో ఓ పక్కకు ఒరిగి పోయింది. ఏటా తుపాన్లు, వరదల సమయంలో అడారుగెడ్డ దాటి ప్రయాణాలు చేయలేకప ోతున్నామని కాజ్‌వే పరిధిలోని ఎనిమిది గ్రామాల గిరిజన ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దుగ్గేరు వద్ద గెడ్డపై వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Oct 30 , 2026 | 11:52 PM