కొనసాగుతున్న సహకార ఉద్యోగుల రిలే దీక్షలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:55 PM
శృంగవరపుకోట పుణ్యగిరి రోడ్డులో మంగళవారం వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు.
శృంగవరపుకోట, జనవరి 6(ఆంధ్రజ్యో తి): శృంగవరపుకోట పుణ్యగిరి రోడ్డులో మంగళవారం వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. పలు సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. వీరికి సీపీఐ రాష్ట్ర నాయకుడు పి.కామేశ్వరరావు మద్దతు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడం లేదని విమర్శించారు. రిటర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని అడుగుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.
గుర్ల, జనవరి 6(ఆంధ్రజ్యోతి): సహకార సొసైటీల్లో పనిచేసే సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కెల్ల జంక్షన్ వద్ద చేపట్టిన రిలే దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈసందర్భంగా దీక్షలో కూర్చున్న సహకార సొసైటీ రాష్ట్ర కార్యదర్శి బెల్లాన రామునాయుడు మాట్లాడుతూ సహకార సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.