రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:58 PM
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని రాజాం తహసీల్దార్ కార్యా లయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
రాజాం/రూరల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని రాజాం తహసీల్దార్ కార్యా లయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు ఎ.చరణ్‌తేజ, గణేష్ మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ వసతిగృహాలకు మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాము, లోకేశ్, ప్రతాప్, శంకర్ పాల్గొన్నారు.