నిబంధనలు పాటించాల్సిందే’
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:44 PM
వ్యాపారులు విధిగా నిబంధనలు పాటించాలని లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ హేమంత్‌కుమార్ స్పష్టం చేశారు.
‘బెలగాం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): వ్యాపారులు విధిగా నిబంధనలు పాటించాలని లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ హేమంత్‌కుమార్ స్పష్టం చేశారు. శనివారం జిల్లాలో కూనేరు, కొమరాడ, పార్వతీపురం పట్టణ ప్రాంతాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అధిక ధరలకు వస్తువుల విక్రయాలు, ప్యాకేజీలపై తప్పనిసరిగా వివరాలు ము ద్రించకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించి రెండు కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.