యథాతథంగా రిజిస్ట్రేషన్లు’
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:00 AM
డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రిజిస్ట్రేషన్లు యథాతథంగా చేస్తున్నామని కురుపాం సబ్ రిజిస్ర్టార్ ఆర్.ఉమా కల్యాణి అన్నారు.
‘కురుపాం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రిజిస్ట్రేషన్లు యథాతథంగా చేస్తున్నామని కురుపాం సబ్ రిజిస్ర్టార్ ఆర్.ఉమా కల్యాణి అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం ద్వారా ప్రజలు తమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తామే సిద్ధం చేసుకునే అవకాశం కూడా అందుబాటులో ఉందన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు.. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చేయడం కాదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు చేపట్టిన చర్యలు మాత్రమేనన్నారు. డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ కారణంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రిజిస్ట్రేషన్, ఇతర శాఖాపరమైన సేవలు అవసరమైన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించ వచ్చని ఆమె సూచించారు.