Share News

Registration of Family Details కుటుంబ వివరాల నమోదు తప్పనిసరి

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:33 AM

Registration of Family Details is Mandatory స్వీయ గణనలో భాగంగా ప్రతిఒక్కరూ విధిగా కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మరిపి వలసలో ఎస్‌హెచ్‌జీ మహిళలతో సమావేశమయ్యారు.

 Registration of Family Details   కుటుంబ వివరాల నమోదు తప్పనిసరి
జన గణనపై మహిళలకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌

సీతానగరం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): స్వీయ గణనలో భాగంగా ప్రతిఒక్కరూ విధిగా కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మరిపి వలసలో ఎస్‌హెచ్‌జీ మహిళలతో సమావేశమయ్యారు. జన గణన ప్రక్రియపై అవగాహన కల్పించారు. అనంతరం వారితో స్వీయ గణన నమోదు చేయించారు. జన గణనలో వ్యక్తిగత వివరాలు, కుటుంబ స్థితిగతులు, విద్య, వృత్తి, ఆదాయం వంటి అంశాలను సరైన విధంగా నమోదు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం పథకాలను రూపొందించి ప్రజలకు మరింత సమర్థంగా సేవలు అందిస్తుందన్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలు గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ .. ప్రతి ఇంటి నుంచి సరైన సమాచారం సేకరించాలని సూచించారు.

Updated Date - Apr 20 , 2026 | 12:33 AM