Share News

Register Cases వారిపై కేసులు నమోదు చేయండి

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:49 PM

Register Cases Against Them హెల్మెట్‌ ధరించని వారితో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం కురుపాం పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు.

Register Cases   వారిపై కేసులు నమోదు చేయండి
కురుపాం పోలీస్‌ స్టేషన్‌పరిసరాలను పరిశీలిస్తున్న ఎస్పీ

  • ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే..

  • ఎస్పీ మాధవరెడ్డి

కురుపాం,మార్చి3(ఆంధ్రజ్యోతి): హెల్మెట్‌ ధరించని వారితో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం కురుపాం పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతిఒక్కరూ విధిగా నిబంధనలు పాటించాలి. లేకుంటే చర్యలు తప్పవు. పోలీసులు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి ప్రయాణించాలి. మర్పు మన నుండే మొదలైతే అది ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది. హెల్మెట్‌ లేకుండా వాహనం ఎవరు నడిపినా ఉపేక్షించొద్దు. హెల్మెట్‌ ధరించని కారణంగా ఏటా ఎంతో మంది ద్విచ్రక వాహదారులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. దీనిపై యువత, ప్రజలకు అవగాహన కల్పించాలి. గంజాయి, నాటుసారా వల్ల కలిగే అనర్థాలను తెలియజేయాలి. సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి. ’ అని తెలిపారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. స్టేషన్‌లో లాకప్‌, కంప్యూటర్‌, రైటర్‌ గదులు, రిసెప్షన్‌ కౌంటర్లను పరిశీలించి.. కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎల్విన్‌పేట సీఐ హరి, ఎస్‌ఐ నారాయణరావు, సిబ్బంది ఉన్నారు.

- జియ్యమ్మవలస: చినమేరంగి సర్కిల్‌ ఆఫీస్‌, పోలీస్‌ స్టేషన్‌ను కూడా ఎస్పీ మాధవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్‌ ప్రాంగణం, రికార్డులు పరిశీలించారు. కేసు ఫైళ్లపై సమీక్షించారు. నేరాల నియంత్రణ, కేసుల సత్వర పరిష్కారానికి టెక్నాలజీ వాడాలని సూచించారు. సీఐ టీవీ తిరుపతిరావు, ఎస్‌ఐ అనీష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 11:49 PM