మంత్రిని కలిసిన ప్రాదేశిక విజేతలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:16 AM
ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో విజయం సాధించిన మండలానికి చెందిన 11 మంది ఎంపీటీసీ సభ్యులు సోమవారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
పాలకొండ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో విజయం సాధించిన మండలానికి చెందిన 11 మంది ఎంపీటీసీ సభ్యులు సోమవారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మత్రికి పుష్పగుచ్ఛం అందజేసి ఎన్నికల విజయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు విజేతలను అభినందించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు రాకోటి వెంకటరావు, ఎంపీటీసీ సభ్యులు కె.యోగిత, పద్మప్రియదర్శిని, వరలక్ష్మి, గౌతమి, కడగల పోలినాయుడు, కిమిడి అనూరాధ, జామి శ్రీను, మాజీ ఎంపీపీ వారాడ సుమంత్నాయుడు తదితరులున్నారు.