సత్ప్రవర్తనతో శిక్షాకాలం తగ్గుదల
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:10 AM
సత్ప్రవర్తనతో ఖైదీల శిక్షా కాలం తగ్గుతుం దని అడిషనల్ ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మేజిస్ర్టేట్ జె.సౌమ్యా జాస్పిన్ అన్నారు.
బెలగాం, డిసెంబరు31 (ఆంధ్రజ్యోతి): సత్ప్రవర్తనతో ఖైదీల శిక్షా కాలం తగ్గుతుం దని అడిషనల్ ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మేజిస్ర్టేట్ జె.సౌమ్యా జాస్పిన్ అన్నారు. బుధవారం ఆమె పార్వతీ పురంలోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడారు. ఖైదీలకు అందిస్తున్న ఆహార నాణ్యత, తాగునీటి సరఫరా, వైద్యసేవలు, పరిశుభ్రత, శానిటేషన్ సదుపాయాలపై ఆరా తీశారు. ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని జైలు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జైలు విజిటింగ్ అడ్వకేట్ టి.జోగారావు, మీడియేషన్ అడ్వకేట్ ఎం.వి.రమణ, సబ్ జైలు పర్యవేక్షణాధికారి జి.రాము తదితరులు పాల్గొన్నారు.