Share News

వీఆర్వోలపై పనిభారం తగ్గించండి

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:06 AM

తమపై పనిభారం తగ్గించాలని కోరుతూ తహసీల్దారు బి.సుదర్శనరావుకు వీఆర్వోలు సోమవారం వినతిపత్రం సమర్పించారు.

వీఆర్వోలపై పనిభారం తగ్గించండి

సంతకవిటి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): తమపై పనిభారం తగ్గించాలని కోరుతూ తహసీల్దారు బి.సుదర్శనరావుకు వీఆర్వోలు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవైపు రీ-సర్వే, మరోవైపు జీఎస్‌డబ్ల్యూఎస్‌ సర్వేలు, సమగ్ర సర్వే కార్యక్రమాల్లో పాల్గొనడం, వివిధ కేసులలో పంచనామా నివేదికలు తయారు చేయడం భారంగా మారుతోందన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయంలో ఉండి రెవెన్యూ సంబంధిత విధులు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తమ సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించాలని తహసీల్దార్‌ను కోరారు.

Updated Date - Feb 17 , 2026 | 12:06 AM