రసాయన ఎరువుల వినియోగం తగ్గించండి
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:25 AM
రైతులు వాతావ రణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతుల ను మార్చాలని.. రసాయన ఎరువులు వినియోగం తగ్గించాలని జిల్లా వ్యవసాయాధి కారి వీటీ రామారావు సూచించారు.
డెంకాడ, జూన్ 22(ఆంధ్రజ్యోతి): రైతులు వాతావ రణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతుల ను మార్చాలని.. రసాయన ఎరువులు వినియోగం తగ్గించాలని జిల్లా వ్యవసాయాధి కారి వీటీ రామారావు సూచించారు. సోమవారం సింగవరం గ్రామంలో ఎల్‌ని నో ప్రభావం, పంట మార్పిడి పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నా రు. రైతులందరు వరి విస్తీర్ణం తగ్గించి.. చిరుధాన్యాల విస్తీర్ణం పెంచాలని సూచించారు. నవధాన్యాలు వేసి 35 నుంచి 40 రోజులు భూమిలో కలియదున్నడం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కె.లక్ష్మణ్ మాట్లాడుతూ రసాయన ఎరువులు యాప్ ద్వారా మాత్రమే రైతులకు ఇస్తారని స్పష్టం చేశారు. అనంతరం వరి, కంది విత్తనాలను రైతులకు అందజేశారు. వ్యవసాయ శాఖ డీడీ భారతి, ఏవో సంగీత, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, జొన్నాడ పీఏసీఎస్ అధ్యక్షులు భవిరిశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తరణాధికారి బి.రామకోటి, వీఏఏలు పాల్గొన్నారు. నెల్లిమర్ల, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ఎరువులు సక్రమంగా వినియోగించడం వల్ల రైతులు అధిక ప్రయోజనం పొందవచ్చని జిల్లా వ్యవసాయాధి కారి వీటీ రామారావు అన్నారు. కొండవెలగాడలో ఏవో శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రైతన్న మీకోసంలో ఆయన పాల్గొని ఇంటింటా రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణా ధికారులు, సిబ్బం ది, రైతులు పాల్గొన్నారు.