సూర్యఘర్ పరికరాల రికవరీ
ABN , Publish Date - May 23 , 2026 | 12:26 AM
కొఠియా వివాదాస్పద 21 గ్రామాల్లో ఒకటైన గంజాయిభద్ర పంచాయతీ ఎగువసెంబి నుంచి గురువారం ఒడిశా అధికారుల తీసు కెళ్లిన సూర్యఘర్ సామగ్రిని ఆంధ్రా పోలీసులు శుక్రవారం రికవరీ చేశారు.
సాలూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): కొఠియా వివాదాస్పద 21 గ్రామాల్లో ఒకటైన గంజాయిభద్ర పంచాయతీ ఎగువసెంబి నుంచి గురువారం ఒడిశా అధికారుల తీసు కెళ్లిన సూర్యఘర్ సామగ్రిని ఆంధ్రా పోలీసులు శుక్రవారం రికవరీ చేశారు. గురువారం ఎగువసెంబిలో ఆరుగురు లబ్ధి దారులకు స్థానిక అధికారులు సూర్యఘర్ పరికరాలను అందజేశారు. విషయం గ్రహించిన ఒడిశా బీడీవో, అక్కడ పోలీసుల నాలుగిళ్ల ఎదుట ఉంచిన సూర్యఘర్ పరికరాలను తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గిరిజనులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉద యం కొఠియా సీఐ క్రాంతికుమార్, సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ, సాలూరు రూరల్ ఎస్‌ఐ రవీంద్ర రాజు.. ఒడిశాకు సంబంధించిన కొఠి యా పోలీసుస్టేషన్‌కు వెళ్లి సూర్యఘర్ పరికరాలను రికవరీ చేసి గిరిజనులకు అందజేశారు.