upadhi Works ఉపాధి పనుల్లో లోపాలుంటే రికవరీ
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:47 PM
Recovery if Irregularities Are Found in upadhi Works ఉపాధి నిధులతో చేపడుతున్న పనుల్లో లోపాలు ఉంటే రికవరీలు తప్పవని కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి వి.సుగణాకరరావు హెచ్చరించారు. బుధ వారం మండలంలోని పలు గ్రామాల్లో ఫాంపాండ్స్‌ను పరిశీలించారు.
గరుగుబిల్లి, జనవరి7(ఆంధ్రజ్యోతి): ఉపాధి నిధులతో చేపడుతున్న పనుల్లో లోపాలు ఉంటే రికవరీలు తప్పవని కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి వి.సుగణాకరరావు హెచ్చరించారు. బుధ వారం మండలంలోని పలు గ్రామాల్లో ఫాంపాండ్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీల్లో గతేడాది చేపట్టిన పనులకు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామన్నారు. నిర్మాణాల్లో తేడాలుంటే బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా పంచాయతీల పరిధిలో రైతులకు ఉపయోగపడే పనులకు ప్రాధా న్యం ఇవ్వాలని, జల సంరక్షణ పనులపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. నూతన చట్టంలో భాగంగా గ్రామసభల ఆమోదం మేరకు ఉపాధి పనులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పరిశీలనలో పార్వతీపురం, సీతంపేట క్లస్టర్ల ఏపీడీలు టి.తివిక్రమరావు, జి.శ్రీహరిరావు, ఎంపీడీవో జి.పైడితల్లి, ఏపీవో ఎం.ఈశ్వరమ్మ, ఇంజనీర్ డి.తేజేశ్వరరావు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.