Share News

Gurukulam Students కోలుకుంటున్న గురుకులం విద్యార్థినులు

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:53 PM

Recovering Gurukulam Students కురుపాం గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం న్యాయాధికారి సౌమ్యాజోస్పిన్‌, డీఎంహెచ్‌వో విజయలక్ష్మి ఆకస్మీకంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై వైద్యులతో సమీక్ష సమీక్షించారు.

  Gurukulam Students   కోలుకుంటున్న గురుకులం విద్యార్థినులు
విద్యార్థినులతో మాట్లాడుతున్న న్యాయాధికారి

కురుపాం/రూరల్‌, నవంబరు9(ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం న్యాయాధికారి సౌమ్యాజోస్పిన్‌, డీఎంహెచ్‌వో విజయలక్ష్మి ఆకస్మీకంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై వైద్యులతో సమీక్ష సమీక్షించారు. ప్రస్తుతం బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని, చాలా వరకు కోలుకుంటున్నారని వారు తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు పాఠశాల పరిధిలో వైద్య సేవలు నిరంతరం కొనసాగాలని, వైద్యులు, సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లా ప్రోగాం అధికారలు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. పిల్లలకు వేడి వేడి ఆహారం, కాచి చల్లార్చిన నీటిని అందించాలని సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా ప్రోగ్రాం అధికారులు జగన్మోహన్‌రావు, రవికుమార్‌ రెడ్డి, డీఎంవో సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 09 , 2026 | 11:53 PM