శాటిలైట్‌తో పంటల వివరాలు నమోదు
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:18 AM
గ్రామాల్లో రైతులు సాగు చేసే పంటల వివరాలను శాట్‌లైట్ ద్వారా నమోదు చేస్తున్నామని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు తెలిపారు.
వ్యవసాయ శాఖ డీడీ రామారావు
గజపతినగరం, ఆగస్టు 20(ఆంధ్ర జ్యోతి): గ్రామాల్లో రైతులు సాగు చేసే పంటల వివరాలను శాట్‌లైట్ ద్వారా నమోదు చేస్తున్నామని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు తెలిపారు. కొత్తబగ్గాం గ్రామంలో ఆయన గురువారం పర్యటించి.. 50 మంది రైతులు సాగు చేసిన పంటల వివరాలను శాటిలైట్ ద్వారా సర్వే చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో వల్ల నీటి ఎద్దడికి గురైన పంటలను, గుర్తించి వాటిని ఏవిధంగా అధిగమించలన్న దానిపై అవగాహన కల్పించారు. వంద శాతం మెట్టు పంట సాగు చేయాలని సూచించారు. రైతులకు ఆదాయ వనరులు సమకూరే విధంగా అధికారులు సలహాలు అందజే యాలన్నారు. ఏడీఏ శ్రీనివాస్, ఏవో కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.