BC Reservations బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సిఫారసులు
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:59 PM
Recommendations to Finalize BC Reservations స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు చేసింది. ఈ మేరకు శుక్రవారం సీఎం చంద్రబాబునాయుడుకు నివేదిక అందజేసింది. జిల్లాలో 451 పంచాయతీలు ఉండగా 61 పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ అమ లుకు కమిషన్ నుంచి సిఫారసులు వెళ్లాయి.
పార్వతీపురం, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు చేసింది. ఈ మేరకు శుక్రవారం సీఎం చంద్రబాబునాయుడుకు నివేదిక అందజేసింది. జిల్లాలో 451 పంచాయతీలు ఉండగా 61 పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ అమ లుకు కమిషన్ నుంచి సిఫారసులు వెళ్లాయి. 2021లో 68 పంచాయతీలను బీసీలకు రిజర్వేషన్ (15.08 శాతం) చేశారు. ఈ సారి 61 పంచాయతీలకు గాను 13.53 శాతం రిజర్వేషన్ చేశారు. మొత్తంగా గత రిజర్వేషన్లను సరిచూసుకంటే ఈ సారి స్థానిక ఎన్నికల్లో బీసీలకు పంచాయతీలలో రిజర్వేషన్లు తగ్గాయని చెప్పొచ్చు. జిల్లాలో 451 పంచాయతీల్లోని 4,128 వార్డులు ఉన్నాయి. ఇందులో 705 వార్డులను బీసీలకు కేటాయించనున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 567 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఈ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 183 స్థానాలు (29.8 శాతం) కేటాయించే అవకాశం ఉంది. 2021లో 549 ఎంపీటీసీ స్థానాలకు 167 స్థానాలు (30.42 శాతం) బీసీలకు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో 34 జడ్సీటీసీ స్థానాలు ఉండగా గతంలో తొమ్మిది స్థానాలు కేటాయించారు.ఈ సారి జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా తొమ్మిది స్థానాలే కేటాయించే అవకాశం ఉంది. ఇక మున్సిపాల్టీల విషయానికొస్తే.. పార్వతీపురం, సాలూరు, పాలకొండ నగర పంచాయతీలకు సంబంధించి 79 వార్డులు ఉండగా ఇందులో 28 వార్డులను బీసీలకు కేటాయించాలని సిఫారుసులు చేశారు. 2021లో 25 వార్డులను బీసీలకే కేటాయించారు.