‘రాఘవతో నాటక రంగానికి గుర్తింపు ’
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:12 AM
తాడిపత్రి రాఘవచార్యులు (బల్లారి రాఘవ)తో నాటక రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి అన్నారు
బెలగాం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): తాడిపత్రి రాఘవచార్యులు (బల్లారి రాఘవ)తో నాటక రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి అన్నారు. బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డీఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాఘవ మహోన్నత కళాకారుడు అని ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.