Share News

Recognition for Loyalty విధేయతకు గుర్తింపు

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:23 AM

Recognition for Loyalty సీనియర్లకు గౌరవిస్తూ.. కొత్తవారికి అవకాశమిస్తూ.. టీడీపీ అధిష్ఠానం జాతీయ, రాష్ట్ర కమిటీలను బుధవారం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని మళ్లీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలో మరో ముగ్గురు జిల్లావాసులకు అవకాశం కల్పించారు.

Recognition for Loyalty విధేయతకు గుర్తింపు
మంత్రి సంధ్యారాణి

  • రాష్ట్ర కార్యవర్గంలో మరో ముగ్గురికి చోటు

  • పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలకు దక్కని స్థానం

పార్వతీపురం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): సీనియర్లకు గౌరవిస్తూ.. కొత్తవారికి అవకాశమిస్తూ.. టీడీపీ అధిష్ఠానం జాతీయ, రాష్ట్ర కమిటీలను బుధవారం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని మళ్లీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలో మరో ముగ్గురు జిల్లావాసులకు అవకాశం కల్పించారు. పార్వతీపురం, పాలకొండ నియోజక వర్గాలకు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు. రాష్ట్ర కార్యవర్గంలో సాలూరు, కురపాం నియోజకవర్గాలకు ప్రాధాన్యం లభించింది. కురుపాం నియోజకవర్గం నుంచి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌, అదే నియోజకవర్గం నుంచి రాష్ట్ర కార్యదర్శులుగా బిడ్డిక పద్మావతి, బొంగు సురేష్‌ను నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలో ఏదో ఒక పదవి లభిస్తుందని పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలకు చెందిన అనేకమంది సీనియర్‌ నాయకులు ఆశించారు. కానీ ఏ ఒక్కరికీ స్థానం కల్పించలేకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. కాగా ఈ రెండు నియోజకవర్గాల్లో నడుస్తున్న గ్రూప్‌ రాజకీయాలే ఇందుకు కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 16 , 2026 | 12:23 AM