ఉత్తమ పనితీరుకు గుర్తింపు
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:44 AM
ఓటు హక్కు నమోదులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కలెక్టర్ రామసుందర్‌రెడ్డి రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.
- కలెక్టర్ రామసుందర్‌రెడ్డికి రాష్ట్రస్థాయి పురస్కారం
- డీఆర్‌వో, బీఎల్‌వోకు కూడా..
విజయనగరం కలెక్టరేట్, జనవరి 25(ఆంధ్రజ్యోతి) ఓటు హక్కు నమోదులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కలెక్టర్ రామసుందర్‌రెడ్డి రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. జిల్లాలో ఓటరు జాబితా రూపకల్పన, ఓటర్ల నమోదు ప్రక్రియ, విధుల్లో అత్యుత్తమ విధానాలు అమలు చేసినందుకు గాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్‌యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్, విశ్రాంతి సీఈవో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నుంచి కలెక్టర్ అవార్డును అందుకున్నారు. అదే విధంగా జిల్లా రెవెన్యూ అధికారి మురళి రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారం, బొండపల్లి మండలంలోని 161 పోలింగ్ కేంద్రం బీఎల్‌వో సత్యనారాయణ ఉత్తమ క్షేత్రస్థాయి అధికారిగా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.