ఇంకుడు గుంతలు తప్పనిసరి చేయాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:31 AM
భూగర్భజలాల స్థాయిని పరిరక్షిం చుకునేందుకు ప్రతి నివాసప్రాంతంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను తప్పనిసరి చేయాలని ఎమ్మెల్యే బేబీనాయన అధికారులను ఆదేశించారు. శనివారం బొబ్బిలి పట్టణంలోని చీపురుపల్లి వీధిలో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్దహోటళ్ల నుంచి సేకరించిన బల్స్ వ్యర్థాల ఉత్పత్తి దారులతో కంపోస్టు తయారీకోసం ఏర్పాటుచేసిన కేంద్రాన్ని పరిశీలించి ప్రారంభిం చారు.
బొబ్బిలి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): భూగర్భజలాల స్థాయిని పరిరక్షిం చుకునేందుకు ప్రతి నివాసప్రాంతంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను తప్పనిసరి చేయాలని ఎమ్మెల్యే బేబీనాయన అధికారులను ఆదేశించారు. శనివారం బొబ్బిలి పట్టణంలోని చీపురుపల్లి వీధిలో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్దహోటళ్ల నుంచి సేకరించిన బల్స్ వ్యర్థాల ఉత్పత్తి దారులతో కంపోస్టు తయారీకోసం ఏర్పాటుచేసిన కేంద్రాన్ని పరిశీలించి ప్రారంభిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇంకుడు గుంతలు లేని చోట భవనాల నిర్మా ణాలకు అనుమతి ఇవ్వరాదన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర సాధనకోసం ప్రతి ఒక్కరమూ పాటుపడతామని స్థానికులు, మునిసిపల్ సిబ్బందితో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. మునిసిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన కార్యక్రమంలో మునిసిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మో హనరావు, మాజీ కౌన్సిలరు సాలా స్వప్నదేవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళి, టీపీ ఆర్‌వో మామిడి జగన్మోహనరావు, టీడీపీ నేతలు వాలేటి తవిటినాయుడు, రెడ్డి కృష్ణమూర్తి, సాలా రమేష్, కోల బలరాం పాల్గొన్నారు.
ఫరామభద్రపురం, జూలై 18(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిరో ధానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన కోరారు.ఈ మేరకు శనివారం బొబ్బిలిలో స్వర్ణరథం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రత్నం, డిప్యూటీ ఎంపీడీవో మరణ వెంకటరమణ, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ చొక్కాపు శ్రీరాములునాయుడు, టీడీపీ మండలాధ్యక్షుడు కరణం విజయభాస్కరరావు, టీడీపీ నాయకుడు అల్లాడ భాస్కరరావు, ముల్లు రాంబాబు పాల్గొన్నారు.