Rebels బరిలో రెబల్స్
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:39 PM
Rebels in the Arena జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కూటమి పార్టీలకు రెబల్స్ బెడద తప్పడం లేదు. గడువు ముగిసినా చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 127 నామినేషన్లు రాగా 111ను ఆమోదించారు. 16 నామినేషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. చివరి రోజు మంగళవారం 59 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మిగతా 52 మంది జడ్పీటీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో టీడీపీ 9, బీజేపీ ఒకటి , జనసేన నుంచి ఐదు, వైసీపీ నుంచి 15 నామినేషన్లు ఉన్నాయి. స్వతంత్య్ర అభ్యర్థులతో పాటు పాటు ఇతర పార్టీలకు చెందిన వారు 22 మంది పోటీలో ఉన్నారు.
జడ్పీటీసీ స్థానాలకు 52 మంది, ఎంపీటీసీ స్థానాలకు 534 మంది పోటీ
వెనక్కి తగ్గని ప్రధాన పార్టీ అభ్యర్థులు
పత్రాలను ఉపసంహరించుకోని వైనం
కూటమికి తప్పని బెడద
పార్వతీపురం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కూటమి పార్టీలకు రెబల్స్ బెడద తప్పడం లేదు. గడువు ముగిసినా చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 127 నామినేషన్లు రాగా 111ను ఆమోదించారు. 16 నామినేషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. చివరి రోజు మంగళవారం 59 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మిగతా 52 మంది జడ్పీటీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో టీడీపీ 9, బీజేపీ ఒకటి , జనసేన నుంచి ఐదు, వైసీపీ నుంచి 15 నామినేషన్లు ఉన్నాయి. స్వతంత్య్ర అభ్యర్థులతో పాటు పాటు ఇతర పార్టీలకు చెందిన వారు 22 మంది పోటీలో ఉన్నారు. అయితే వివిధ మండలాల నుంచి కూటమి పార్టీల తరపున నామినేషన్ వేసిన వారు వెనక్కి తగ్గడం లేదు. పొత్తు ధర్మం పక్కన పెట్టి.. పరిషత్ పోరుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్లను ఉపసంహరించుకోని పలువురు అభ్యర్థులు బీ ఫారాలు రాకపోయినా.. రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. బలిజిపేట, పార్వతీపురం జడ్పీటీసీ స్థానాలకు జనసేనకు కేటాయించారు. బలిజిపేట నుంచి టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన దుర్గేశ్వరి ఇండిపెండెంట్‌గా రంగంలో ఉన్నారు. గుమ్మలక్ష్మీపురం జడ్పీటీసీ స్థానం జనసేనకు కేటాయించగా.. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పాడి సుదర్శనరావు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. వీరఘట్టం జడ్పీటీసీ స్థానం జనసేనకు కేటాయించగా.. బీజేపీ, జనసేన నుంచి నామినేషన్లు స్వతంత్య్ర అభ్యర్థులుగా కొనసాగుతున్నారు. ఇలా పలు మండలాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు రెబల్స్‌గా ప్రాదేశిక పోరులో ఉన్నారు. ఇక జిల్లాలో 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 1181 మంది నామినేషన్లు వేయగా 647 మంది పత్రాలను ఉపసంహరించుకున్నారు. 534 మంది బరిలో ఉన్నారు. సీతంపేటలో 13, వీరఘట్టంలో 14 సెగ్మెంట్లలో అత్యధికంగా జనసేన ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
మూడు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులకు బీఫారాలు
పాచిపెంట రూరల్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిల్లో మూడు స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులకు ఆయా పార్టీలు బీ ఫారాలు ఇచ్చాయి. దీంతో ఇరు పార్టీల అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పాచిపెంట ఎంపీటీసీ-2 స్థానంలో టీడీపీ అభ్యర్థిగా సాలూరు వెంకటలక్ష్మి, జనసేనపార్టీ తరపున గౌడు పోలమ్మ బీఫారాలు పొందారు. ఇదే సెగ్మెట్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పెనుమజ్జి యశోద పోటీ చేస్తున్నారు. పాచిపెంట-3 ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా అంపోలు గౌతమి, జనసేన అభ్యర్థిగా మాదిరెడ్డి పైడితల్లి బీఫారాలు పొందారు. గుమ్మడిగూడ టీడీపీ అభ్యర్థిగా ఎర్రజన్ని కన్నయ్య, జనసేన అభ్యర్థిగా బోయన చంద్రయ్య బీఫారాలు పొంది ఎన్నికల బరిలో నిలిచారు.