దారికొచ్చిన రెబల్స్!
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:00 AM
నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో కూటమి పార్టీలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ రెబల్స్ అభ్యర్థులు దారి కొస్తున్నారు.
- అసంతృప్తులను బుజ్జగించిన ఎమ్మెల్యే కోళ్ల , డీసీఎంఎస్ చైర్మన్ గొంప
- కలిసి పనిచేసేందుకు అంగీకారం
శృంగవరపుకోట, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో కూటమి పార్టీలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ రెబల్స్ అభ్యర్థులు దారి కొస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ పెద్దలు అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. పార్టీ గెలుపునకు పనిచేసేలా ఒప్పిస్తున్నా రు. అవకాశాన్ని బట్టి సర్పంచ్, నామినేటెడ్, పార్టీ పదవు లను అప్పగిస్తామని నచ్చజెబుతున్నారు. ఇదే సమయంలో రెబల్స్ విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని కూ డా వివరిస్తున్నారు. రెబల్స్‌ను పార్టీకి దూరంగా ఉంచాలన్న ఆదేశాలు ఉన్నాయని, ఆలోచించుకోవాలని చెబుతున్నారు. డమ్మిలుగా మారి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరు తున్నారు. దీంతో రెబల్స్ అభ్యర్థులు మెత్తబడ్డారు. కూటమి పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం కలిసొస్తున్నారు. ప్రస్తుతం అంతా కలిసి నడుస్తుండడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో సంతోషం కనిపిస్తుంది.
-ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొత్తవలస మండలానికి చెందిన గొరపల్లి జయప్రకాష్ నారాయణ (శివ)కు జడ్పీటీసీగా పోటీ చేసేందుకు పార్టీ అవకాశం ఇ చ్చింది. ఈ స్థానాన్ని విశాఖ పార్లమెంట్ టీడీపీ ఉపాధ్య క్షుడు గొరపల్లి రాము ఆశించారు. కానీ, టికెట్ రాకపోవ డంతో తీవ్ర అసహనం చెందారు. దీంతో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఈమె భర్త బాలాజీ అప్పలరామప్రసాద్ రంగంలోకి దిగారు. రాముతో పాటు జడ్పీటీసీ అభ్యర్థి శివ, జనసేన నాయకుడు మేళాస్త్రి అప్పారావును ఒక చోటకు చేర్చారు. విబేధాలు వీడాలని, కూటమి కోసం కలిసి పని చేయాలని నచ్చజెప్పారు. ముగ్గురి చేతులనూ కలిపి కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
-జడ్పీ మాజీ చైర్మన్ లగుడు సింహాద్రి కుమారుడు రవికుమార్ కుటుంబానికి జామి ఎంపీపీ టికెట్‌ను టీడీపీ అధిష్ఠానం కేటాయించింది. దీనిపై ఎంపీపీ పదవిని ఆశిం చిన వర్రి రమణతో పాటు ఈయన వర్గానికి చెందిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాల్లో రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. తరు వాత వీరిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసం హరించుకున్నారు. కానీ, పార్టీ అభ్యర్థుల గెలుపునకు పని చేయకూడదని నిర్ణయించుకున్నారు. వీరు ప్రజాదరణ కలి గిన నాయకులు కావడంతో రెండు రోజుల కిందట డీసీ ఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ చర్చలు జరిపారు. పార్టీ గెలు పునకు పని చేయాలని సూచించారు. వారి హమీలను నెరవేర్చేందుకు ఒప్పుకున్నారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యే లలిత కుమారి దృష్టిలో పెడతానని వారికి మాటి చ్చారు. దీంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చారు.
- తన అభిప్రాయానికి విరుద్ధంగా ఓ నాయకుడికి ఎంపీటీసీ టికెట్ ఇచ్చారని వేపాడ మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అలిగారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ మం డల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొంప వెంకట రావు, కొట్యాడ రమణ మూర్తి ఆయనతో మాట్లాడారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు ప్రతిపాదిస్తామని హెచ్చరిం చారు. దీంతో ఆయన దారిలోకి వచ్చారు.