పేదోడి సొంతింటి కల సాకారం
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:33 AM
కూటమి ప్రభుత్వం ఓ పేదోడి సొంతింటి కలను సాకారం చేసింది. ఓ నిరుపేద గీత కార్మికునికి రూ.5 లక్షల వ్యయంతో పక్కా గృహాన్ని నిర్మించి ఇచ్చింది.
హామీ నెరవేర్చిన ముఖ్యమంత్రి
పైలపేటలో గీత కార్మికుడికి నిర్మించి ఇచ్చిన ఇల్లు ప్రారంభం
చీపురుపల్లి, జూలై 15(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఓ పేదోడి సొంతింటి కలను సాకారం చేసింది. ఓ నిరుపేద గీత కార్మికునికి రూ.5 లక్షల వ్యయంతో పక్కా గృహాన్ని నిర్మించి ఇచ్చింది. రికార్డు సమయంలో 88 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ పక్కా గృహాన్ని ఎమ్మెల్యే కళావెంకటరావు బుధవారం ప్రారంభించా రు. దీంతో పాటు తన సొంత నిధులతో ఓ స్మార్ట్ టీవీని కూడా ఎమ్మెల్యే బహూ కరించడంతో ఆ కుటుంబం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది. 2026 ఫిబ్రవరి 26న చీపురుపల్లి మండలంలోని పైలపేట పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కనే ఉన్న పొలంలో రొంగలి ఎల్లయ్య అనే ఓ గీత కార్మికున్ని కలిసి మాట్లాడారు. కుటుంబ స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఎల్లయ్య, తనకు పక్కా గృహం లేదని చెప్పాడు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లయ్యకు పక్కా గృహం నిర్మించి, ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారు లు తగిన ఉత్తర్వులు జారీ చేసి, 88 రోజుల్లో గృహ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ గృహాన్ని ఎమ్మెల్యే కళావెంకటరావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, పార్టీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, గవిడి నాగరాజు, రెడ్డి లక్ష్మణరావు, పైల త్రినాథ పాల్గొన్నారు.