Share News

Ready for election battle సమరానికి సై

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:32 AM

Ready for election battle కూటమి పార్టీల మధ్య సర్దుబాటు కుదిరింది. పోటీ చేసే పార్టీపై స్పష్టత వచ్చింది. అభ్యర్థుల పేర్లపై కూడా కొద్ది వ్యవధిలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్లకు మూడు రోజులే గడువు ఉండడంతో మూడు పార్టీల నాయకులు టెన్షన్‌ టెన్షన్‌తో ఎదురుచూశారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక గందరగోళం చెందారు.

Ready for election battle సమరానికి సై

సమరానికి సై

కూటమి పార్టీల సర్దుబాటు కొలిక్కి

విజయనగరం కార్పొరేషన్‌, బొబ్బిలి మున్సిపాలిటీ టీడీపీకే

నెల్లిమర్ల నుంచి బీజేపీ

వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి

విజయనగరం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): కూటమి పార్టీల మధ్య సర్దుబాటు కుదిరింది. పోటీ చేసే పార్టీపై స్పష్టత వచ్చింది. అభ్యర్థుల పేర్లపై కూడా కొద్ది వ్యవధిలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్లకు మూడు రోజులే గడువు ఉండడంతో మూడు పార్టీల నాయకులు టెన్షన్‌ టెన్షన్‌తో ఎదురుచూశారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక గందరగోళం చెందారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు. దాదాపు రాత్రి 10.30 తర్వాత వారందరికీ స్పష్టత వచ్చింది. దీంతో పోటీకి సై అంటున్నారు. జిల్లాలో విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి పార్టీల పొత్తులో భాగంగా టీడీపీకి లభించాయి. ఊహించని విధంగా నెల్లిమర్ల నగరపంచాయతీని బీజేపీకి కేటాయించారు. పొత్తు కొలిక్కిరావడంతో గురువారం రాత్రి ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. శుక్రవారం పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కినుంది. కూటమి నేతలంతా మరింత ఐక్యంగా ముందుకు వెళ్లనున్నారు. గెలుపు ఆయుధాలను బయటకు తీసి విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు.

- విజయనగరం కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం అధికారికంగా పేరును ప్రకటించింది. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా చేసిన కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి ఇప్పుడు మేయర్‌ అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలో తలపడనున్నారు. నగరపాలక సంస్థ రిజర్వేషన్‌ జనరల్‌ మహిళ కావడంతో ముందు నుంచి ఆమె అనుకున్నట్టే పోటీలో దిగుతున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో నామినేషన్‌ వేయాలని కూడా నిర్ణయించుకున్నారు.

------------------------------

Updated Date - Oct 16 , 2026 | 12:32 AM