Share News

DPO డీపీవోగా రవీంద్ర

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:20 PM

Ravindra Appointed as DPO జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా ఎస్‌.రవీంద్ర నియామకమయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉత్తర్వులు విడుదల చేశారు.

 DPO డీపీవోగా రవీంద్ర
జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులైన రవీంద్ర

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా ఎస్‌.రవీంద్ర నియామకమయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. గతంలో ఒకసారి రవీంద్రను జిల్లా అధికారిగా నియ మించినా.. న్యాయపరమైన సమస్యలు నెలకొనడంలో ఆయన విధుల్లో చేరలేదు. ప్రస్తుతం రవీంద్ర విశాఖలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారిగా, జిల్లా డ్వామా కార్యాలయంలో ఎఫ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతిపై పార్వతీపురం మన్యం జిల్లాకు నియమించారు. ప్రస్తుతం డీపీవోగా విధులు నిర్వహిస్తున్న కొండలరావును రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొద్ది రోజుల్లో రవీంద్ర జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ఆయన పలు మండలాల్లో ఎంపీడీవోగా విధులు నిర్వహించారు.

Updated Date - Apr 25 , 2026 | 11:20 PM