Share News

rates hike కొనేటట్టు లేవ్‌

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:16 AM

rates hike మార్కెట్‌లో పంచదార(చక్కెర), ఉల్లిపాయల ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. తక్కువ సమయంలో పైపైకి ఎగబాకుతున్నాయి. జూలై 23 నుంచి పెరగడం ప్రారంభమైన ఈ ధరలు ఆగస్టు 30 నాటికి బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్‌లో వివిధ వస్తువుల డిమాండ్‌, సప్లయ్‌లు ఆధారంగా పెరగడం, తగ్గడం సహజమే అయినా, గత నెల రోజులుగా చెక్కెర, ఉల్లిపాయల ధరలు మాత్రం తగ్గడం లేదు. మిగతా వస్తువుల విక్రయాలపైనా వీటి ప్రభావం పడుతున్నది.

rates hike కొనేటట్టు లేవ్‌

కొనేటట్టు లేవ్‌

చక్కెర, ఉల్లిపాయల ధరలు పైపైకి

బెంబేలెత్తుతున్న సామాన్యులు

అనుబంధ వస్తువుల విక్రయాలపైనా ప్రభావం

విజయనగరం రూరల్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి):

మార్కెట్‌లో పంచదార(చక్కెర), ఉల్లిపాయల ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. తక్కువ సమయంలో పైపైకి ఎగబాకుతున్నాయి. జూలై 23 నుంచి పెరగడం ప్రారంభమైన ఈ ధరలు ఆగస్టు 30 నాటికి బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్‌లో వివిధ వస్తువుల డిమాండ్‌, సప్లయ్‌లు ఆధారంగా పెరగడం, తగ్గడం సహజమే అయినా, గత నెల రోజులుగా చెక్కెర, ఉల్లిపాయల ధరలు మాత్రం తగ్గడం లేదు. మిగతా వస్తువుల విక్రయాలపైనా వీటి ప్రభావం పడుతున్నది. పంచదార ధర మార్కెట్‌లో పెరగడంతో టీ, కాఫీ, స్వీట్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. విజయనగరంలో టీ ధర 5 నుంచి 7 రూపాయలు వుండగా, ప్రస్తుతం 10 రూపాయలకు ఎక్కడా తగ్గడం లేదు. కాఫీ ధర 15 నుంచి 18 రూపాయలు వుండగా తాజాగా రూ.20 చేరింది. పంచదారతో తయారు చేసే స్వీట్లు కిలో ధర 150 నుంచి 170 రూపాయలు ఉండేవి. గత మూడు రోజుల నుంచి ధరపై 20 రూపాయలు అదనంగా పెరిగింది.

- స్థానికంగా షుగర్‌ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తగ్గడంతో చక్కెరను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. జూలై 25 నాటికి కిలో చెక్కెర 46 రూపాయలు వుండగా, తాజాగా కిలో పంచదార ధర రూ.62కు చేరింది. మరోవైపు సెప్టెంబరు 14 నుంచి వరుసుగా పండుగల సీజన్‌ నేపథ్యంలో పంచదార ధర మరింత పెరిగే అవకాశం వుందన్న అభిప్రాయాన్ని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తమ వద్ద వున్న బఫర్‌ నిల్వలను మార్కెట్‌లోకి తీసుకువస్తే పంచదార ధర తిరిగి సాధారణ స్థితికి చేరే అవకాశం వుంది.

- ఉల్లిపాయల ధరల్లో మార్పులు రావడం సహజం. ముఖ్యంగా వర్షాకాలంలో ఉల్లిపాయల ధరలు పెరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఊహించని స్థాయిలో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి. జూలై చివరి వారంలో మార్కెట్‌లో ఉల్లి ధర రూ.42 వుండగా, ఆగస్టు నెలాఖరు నాటికి మార్కెట్‌లో రూ.58గా వుంది. మరింత పెరిగే అవకాశం వుందన్న అభిప్రాయాన్ని మార్కెట్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి ఉల్లిపాయలు రావాల్సి వుంది. మన దగ్గర వర్షాలు పెద్దగా లేవు. ఈ పరిస్థితిలో దిగుమతిపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తే ఉల్లి ధర మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. విజయనగరానికి ప్రతి రోజు 8 నుంచి 10 టన్నులు ఉల్లిపాయలు అవసరం. జిల్లా వ్యాప్తంగా మరో 12 టన్నులు అవసరం. నాసిక్‌తో పాటు, కర్నూలు జిల్లా నుంచి ఉల్లిపాయలు వస్తుంటాయి. కొద్ది రోజులుగా ఉల్లిపాయల లోడ్‌లతో వాహనాలు వస్తున్నప్పటికీ ఒకరోజు ఎక్కువ.. ఒక రోజు తక్కువ వస్తున్నాయి. ప్రస్తుతం ఽఉల్లి ధర రైతు బజార్‌లో రూ.49 కాగా బహిరంగ మార్కెట్‌లో రూ.55 నుంచి రూ.60 వరకూ పలుకుతోంది.

కర్ణాటక, మహారాష్ట్ర నుంచి షుగర్‌

పంచదారకు సంబంధించి కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ప్రతి రోజు లారీలతో లోడ్‌లు వస్తాయి. విజయనగరం టౌన్‌లో ప్రతి రోజు 2 వేల నుంచి 3 వేల కేజీల పంచ దారను వినియోగిస్తున్నారు. వీటిలో ఎక్కువగా స్వీట్‌ షాపుల వారు కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత స్థానంలో టీ, కాఫీ, జ్యూస్‌ షాపుల వారు వినియోగిస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా 1,200 కేజీల నుంచి 1,500 కేజీలు చొప్పున ప్రతి రోజు పంచదారను వినియోగిస్తున్నారు. కిలో పంచదార ధర ప్రస్తుతం రూ.61 ఉంది. జూలై 23న 45 రూపాయలు వుండేది. వినాయక చవితి మొదలుకుని దీపావళి వరకూ వరుసుగా పండుగల నేపథ్యంలో పెద్ద కంపెనీలు, స్వీట్‌ షాపుల వారు వందల కిలోలు కొనుగోలు చేసి నిల్వ వుంచుకోవడం వల్ల మార్కెట్‌లో పంచదార నిల్వలు తగ్గాయి. ఈ కారణంగానే ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

------------------

Updated Date - Aug 31 , 2026 | 12:16 AM