Share News

సంప్రదాయాలకు రంగోత్సవాలు ప్రతీక: డీఈవో

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:10 AM

రంగోత్సవాలు సంప్రదాయాలకు ప్రతీక అని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు తెలిపారు. బుధవారం వేణుగోపాలపు రం ప్రభుత్వ డైట్‌ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌ దత్తి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రంగోత్సవపోటీలు నిర్వహించారు.

సంప్రదాయాలకు రంగోత్సవాలు  ప్రతీక: డీఈవో
విజేతలకు బహుమతులు అందజేస్తున్న డీఈవో మాణిక్యంనాయుడు

నెల్లిమర్ల, జనవరి 21(ఆంధ్రజ్యోతి): రంగోత్సవాలు సంప్రదాయాలకు ప్రతీక అని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు తెలిపారు. బుధవారం వేణుగోపాలపు రం ప్రభుత్వ డైట్‌ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌ దత్తి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రంగోత్సవపోటీలు నిర్వహించారు.ఈసందర్భంగా డీఈవో మాణిక్యంనాయుడు మాట్లాడుతూ రంగోత్సవ వేడుకలు తెలుగువారి ఆచార వ్యవహారాలకు ప్రతిరూపమ న్నారు.ఈ తరహాకార్యక్రమాల వల్ల సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అం దించవచ్చని తెలిపారు.ఈవేడుకలకు ప్రొగ్రాం కోఆర్డినేటర్లగా డైట్‌ లెక్చరర్లు ఎం.రమేష్‌, కే.రజిత, సీహెచ్‌.శేషాద్రి సోమయాజులు, ఎస్‌.ఉమామహేశ్వరరావు వ్యవహరించారు. జిల్లాలోని 32 పాఠశాలల నుంచి 260 మంది విద్యార్థులు పాల్గొనగా వివిధ పోటీల విజేతలకు డీఈవో బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయి పోటీల విజేతలు విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Jan 22 , 2026 | 12:10 AM