Share News

Elephants గజరాజుల బీభత్సం

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:51 PM

Rampage of Wild Elephants తోటపల్లి పంచాయతీ పరిధి నందివానివలస, గదబవలస గ్రామాల్లో గజరాజులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఆయా ప్రాంతాల్లో పలువురు రైతులకు చెందిన అరటి, నువ్వు, వరి పంటలతో పాటు వ్యవసాయ సామగ్రిని ధ్వంసం చేశాయి.

 Elephants   గజరాజుల బీభత్సం
నందివానివలస పంట పొలాల్లో సంచరిస్తున్న గజరాజుల గుంపు

గరుగుబిల్లి, ఏప్రిల్‌26(ఆంధ్రజ్యోతి): తోటపల్లి పంచాయతీ పరిధి నందివానివలస, గదబవలస గ్రామాల్లో గజరాజులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఆయా ప్రాంతాల్లో పలువురు రైతులకు చెందిన అరటి, నువ్వు, వరి పంటలతో పాటు వ్యవసాయ సామగ్రిని ధ్వంసం చేశాయి. సాగునీరు సరఫరా అయ్యే పైపులను నాశనం చేశాయి. అరటి పంటను పనికి రాని విధంగా చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికందొచ్చిన పంటలను ధ్వంసం చేయడంతో లబోదిబోమంటున్నారు. గజరాజులు గుంపు సంచారంతో నష్టాలకు గురికావాల్సి వస్తుందని వాపోయారు. సంబంధిత అటవీశాఖ అధికారులు, ట్రాకర్లు స్పందించి.. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అదేవిధంగా నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 26 , 2026 | 11:51 PM