రాజాంలో ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:12 AM
రాజాంలో మంగళవారం సాయంత్రం ఈదు రుగాలులు బీభత్సం సృష్టించాయి.
కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
రూ.2లక్షల ఆస్తి నష్టం
రాజాం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాజాంలో మంగళవారం సాయంత్రం ఈదు రుగాలులు బీభత్సం సృష్టించాయి. వీటికి తోడు వర్షం కురవడంతో ఎక్కడికక్కడే విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. సుమారు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆ శాఖ ఏడీఏ, ఏఈ, సిబ్బంది యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. స్తంభాలు నేలకొర గడంతో సుమారు రూ.2లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. కూలిన స్తంభాల చోట కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. విపత్తుల సమయంలో ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.