Share News

పిచ్చికుక్క స్వైర విహారం

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:37 AM

మండలంలోని కందిశ గ్రామంలో శుక్రవారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది.

పిచ్చికుక్క  స్వైర విహారం

  • ఆరుగురికి గాయాలు

రేగిడి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని కందిశ గ్రామంలో శుక్రవారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దొరికిన వారిని దొరికినట్టు దాడిచేసి గాయపరిచిం ది. ఈ ఘటనలో డోల సూర్యనారాయణ, మెరుగుల వైకుంఠ రావు, డోల గౌరినాయుడు, ఎద్దు పెంటయ్య, రౌతు నారాయ ణమ్మ, శాసపు నారాయణమ్మలు గాయపడ్డారు. నాగావళి నదికి వెళ్లే సమయంలో ఓ ఇద్దరిని ఈ కుక్క వెంబడించి.. గాయపరిచింది. అనంతరం ఊర్లోకి వెళ్లి నలుగురిపై దాడి చేసింది. వీరిలో వైకుంఠరావు, డోల సూర్యనారాయణ, ఎద్దు పెంటయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని రాజాం ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించారు. గాయపరిచిన కుక్కను గ్రామస్థులు ముకుమ్మడిగా పట్టుకుని హతమార్చారు.

Updated Date - Nov 14 , 2026 | 12:37 AM