Share News

పిచ్చికుక్క స్వైరవిహారం

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:21 AM

మండలంలో పిచ్చి కుక్క ఆదివారం స్వైర విహారం చేసింది.

  పిచ్చికుక్క  స్వైరవిహారం

  • ఆరుగురిపై దాడి

జియ్యమ్మవలస, అక్టోబరు 11(ఆంధ్రజ్యో తి): మండలంలో పిచ్చి కుక్క ఆదివారం స్వైర విహారం చేసింది. నాలుగు గ్రామాలకు చెందిన ఆరుగురిపై దాడిచేసింది. దాంతో వారు గాయాలపాలయ్యారు. ముందుగా బాసంగి గ్రామంలో జి.తిరుపతినాయుడు, పి.సీతారాంపై పిచ్చికుక్క దాడిచేసింది. సింగ నాపురంలో ఎల్‌.లీలావతి, కిల్లాడ జానకిలను గాయపరిచింది. అనంతరం పరజపాడు గ్రామానికి వెళ్లి బి.పార్వతి, కుందర తిరువాడ తవిటన్నదొరపై దాడిచేసింది. వీరందరికీ చినమేరంగి సీహెచ్‌సీ డాక్టర్‌ సీహెచ్‌ అభిజ్ఞ చికిత్స చేశారు.

Updated Date - Oct 12 , 2026 | 12:21 AM