Share News

Library Organization ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రామకృష్ణ

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:36 PM

Ramakrishna Appointed Chairman of the United District Library Organization ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  Library Organization ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రామకృష్ణ

పార్వతీపురం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జియ్యమ్మవలస మండలం చిన్నకొదమ గ్రామానికి చెందిన ఆయన టీడీపీ సీనియర్‌ నాయకుడిగా విశేష సేవలందిస్తున్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రామకృష్ణ నియామకంపై పలువురు టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శత్రుచర్లను పరామర్శించిన డొంకాడ

జియ్యమ్మవలస: విశాఖలో ఉంటున్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డొంకాడ రామకృష్ణ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శత్రుచర్లను పరామర్శించిన వారిలో టీడీపీ సీనియర్‌ నాయకుడు లంక గోపాలం తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:37 PM