భక్తిశ్రద్ధలతో రంజాన్
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:34 PM
జిల్లాలోని ముస్లింలు శనివారం రంజాన్‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
-జిల్లాలోని మసీదుల్లో సందడి
- ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
విజయనగరం/ కల్చరల్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ముస్లింలు శనివారం రంజాన్‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కొత్త వస్త్రాలు ధరించి మసీదులకు వెళ్లి నమాజ్ చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్‌ముబారక్ చెప్పుకున్నారు. నగరంలోని మూడులాంతర్లు, అంబటి సత్రం రోడ్డు, కంటోన్మెంట్, తోటపాలెం రోడ్డు, డకినీవీధి, బాబామెట్ట, అబాద్‌వీధి, అయ్యన్నపేట, కణపాక రోడ్డు తదితర ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని తోటపాలెం రోడ్డులో ఉన్న మసీదులో నమాజ్ చేస్తున్న ముస్లింల వద్దకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలో ఎక్కడ చూసినా ముస్లింలు సందడి కనిపించింది.