Share News

జాతీయ వేదికపై రాజాం విద్యార్థినులు

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:35 AM

ఢిల్లీలో మూడు రోజులపాటు నిర్వహి స్తున్న జాతీయ సాంస్కృతిక సదస్సులో రాజాం బాల భవన్‌ విద్యార్థినులు తొలిరోజు శుక్రవారం పాల్గొని, ప్రదర్శన ఇచ్చారు.

జాతీయ వేదికపై రాజాం విద్యార్థినులు

రాజాం రూరల్‌, అక్టోబరు 30(ఆంధ్ర జ్యోతి): ఢిల్లీలో మూడు రోజులపాటు నిర్వహి స్తున్న జాతీయ సాంస్కృతిక సదస్సులో రాజాం బాల భవన్‌ విద్యార్థినులు తొలిరోజు శుక్రవారం పాల్గొని, ప్రదర్శన ఇచ్చారు. చిన్నారులు హర్షిత, గీతిక, సింధూజ, సిరిచందన, నవ్య కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. హెరిటేజ్‌ ఆఫ్‌ ఇండియా సందేశంతో చేసిన నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. బాలభవన్‌ రాజాం డైరెక్టర్‌ డా.సుంకరి రమేష్‌తో పాటు తారక్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:35 AM